మొబైల్ అప్పగింతపై ఏసీబీకి కేటీఆర్ లేఖ
NEWS Jun 18,2025 08:41 pm
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి వ్యక్తిగత మొబైల్ ను సమర్పించాలని ఏసీబీ ఆదేశించింది కేటీఆర్ ను. దీనిపై స్పందించారు మాజీ మంత్రి. తనకు ఇచ్చిన నోటీసులకు లేఖ ద్వారా సమాధానం పంపించారు. ఇది రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందని వెల్లడించారు. దీనిపై ఏసీబీ ఇంకా స్పందించ లేదు.