నకిలీ కరెన్సీ కేసులో విదేశీయుడికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నో.. కీలక వ్యాఖ్యలు
NEWS Jun 18,2025 06:19 pm
నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చలామణి చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు గండి కొట్టే ప్రయత్నం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీయుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్టయిన అతడికి బెయిల్ మంజూరు చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇటువంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని, ఇలాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సరైంది కాదని స్పష్టం చేసింది.