పామాయిల్ పై సుంకం తగ్గించాలి - సీఎం
NEWS Jun 18,2025 06:14 pm
పామ్ ఆయిల్ పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడి పంటకు సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పండించిన పంటకు సరైన ధర దక్కాలంటే..ఆ పంటకు మార్కెట్టులో ఎలాంటి డిమాండ్ ఉందనే సమాచారం ఉండాలన్నారు.