తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లును తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలి : ఏఐఓబీసీఎస్ఏ
NEWS Jun 18,2025 06:04 pm
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూడ్‌లో చేర్చాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఓబీసీఎస్ఏ) డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్ తో ఏఐఓబీసీఎస్ఏ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఈ నెల 21న సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్, జాతీయ కార్యదర్శి మహేశ్ గౌడ్ తెలిపారు. దీక్షకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బుధవారం ఆవిష్కరించారు.