రైతుల పక్షాన మరో పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం..
NEWS Jun 18,2025 05:32 pm
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ చూపిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై తెలంగాణ రైతాంగం తరపున పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంపై చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో త్వరలోనే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నది.