టీమిండియాకు కోహ్లీ దూరం కావడం కోలుకోలేని దెబ్బ: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
NEWS Jun 18,2025 04:15 pm
ఇంగ్లండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురైన అతిపెద్ద సమస్య రోహిత్ శర్మ రిటైర్మెంట్ కంటే విరాట్ కోహ్లీ జట్టుకు దూరం కావడమేనని ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జెఫ్రీ బాయ్‌కాట్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ జట్టులో కీలక ఆటగాడని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని వ్యాఖ్యానించారు.