ఏపీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. కోల్ కతా ఎయిర్ పోర్టులో తాము మాజీ మంత్రి కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నట్లు వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. పూర్తిగా అబద్దమని, నమ్మవద్దని కోరారు. తాము లుక్ అవుట్ నోటీసులు ఇచ్చింది వాస్తవమేనని పేర్కొన్నారు. ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే వెంటనే కోర్టులో హాజరు పరుస్తామన్నారు. కొడాలి నానిపై పలు కేసులు నమోదు చేశామన్నారు. తనను ఎప్పుడు అరెస్ట్ చేసేది త్వరలో తెలియ చేస్తామన్నారు.