పేరు మారనున్న రేణిగుంట ఎయిర్ పోర్ట్
NEWS Jun 18,2025 03:49 pm
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టు పేరును మార్చాలని నిర్ణయించింది. దీనికి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పేరు పెట్టాలని , దీనికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని చెప్పారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. అంతే కాకుండా పవిత్ర ప్రసాదాల నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. విద్యా, నియామకాలలో పూర్తి పారదర్శకత పాటించేలా సంస్కరణలు తీసుకు వస్తున్నట్లు చెప్పారు.