కేసీఆర్, జగన్ నా ఫోన్ ట్యాప్ చేయించారు... రేవంత్, చంద్రబాబు విచారణను వేగవంతం చేయాలి: షర్మిల
NEWS Jun 18,2025 03:42 pm
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ తతంగం నడిచిందని షర్మిల ఆరోపించారు. "ఒక మహిళ అని కూడా చూడకుండా, ఒక రాజకీయ నాయకురాలిగా నా కార్యకలాపాలను అడ్డుకోవడానికి, నా వ్యూహాలను తెలుసుకోవడానికి ఇంత నీచమైన చర్యలకు పాల్పడ్డారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆమె దుయ్యబట్టారు.