మహిళల రక్షణకు కమిషన్ ప్రాధాన్యత
NEWS Jun 18,2025 03:16 pm
మహిళల రక్షణే జాతీయ మహిళా కమిషన్ లక్ష్యమని స్పష్టం చేశారు కమిషన్ సభ్యురాలు అర్చనా మజుందార్. ఏపీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ మహిళలు, యువతులు, బాలికలకు అన్యాయం జరిగినా వెంటనే కమిషన్ స్పందిస్తుందన్నారు. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామని , ఎవరైనా సరే భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. లైంగికంగా వేధింపులకు గురి చేసినా , పని చేసే చోట, చదువుకునే ప్రాంతంలో ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు.