రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
NEWS Jun 18,2025 03:00 pm
ఏపీలో చంద్రబాబు సీఎంగా కొలువు తీరాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. తను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అప్పు తీర్చలేదంటూ మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పక్కదారి పట్టిందన్నారు. మహిళలు, బాలికలు, యువతుల పట్ల అరాచకాలు, దారుణాలు మితిమీరి పోయాయని వాపోయారు .