రూ.200 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం
NEWS Jun 18,2025 02:41 pm
ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములు చెర వీడుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాలాపూర్ తహసీల్దార్ ఇందిరా దేవి ఆధ్వర్యంలో డీటీ మహిపాల్ రెడ్డి, ఆర్‌ఐలు ప్రశాంతి, జమీల్.. బాలాపూర్ మండల పరిధిలో 10.25 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు చుట్టూ ఫెన్సింగ్ వేయించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న భూమి విలువ రూ.200 కోట్ల పైచిలుకు ఉంటుందని అధికారిక అంచనా.