రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు శ్రీవారి పేరు పెట్టాలి
NEWS Jun 18,2025 02:30 pm
తిరుపతిలోని రేణిగుంట ఎయిర్ పోర్టుకు శ్రీవారి పెట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. పేరు మార్పుపై ఏయివేషన్ సంస్థ (డీజీసీఏ)కు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోరారని అన్నారు. స్థలం కేటాయించగానే ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.