విద్యార్థి నాయకుడిపై హత్యాయత్నం చేసిన
దుండగులను అరెస్టు చేయాలి ABVP
NEWS Jun 19,2025 11:38 pm
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా దగ్గర ఎబివిపి నాయకులు నిరసన చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి మంగళపల్లి మారుతి మాట్లాడుతూ.. "విద్యార్థి హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా పోరాడుతున్న ఆదిత్యపై పదునైన ఆయుధాలతో హత్యాయత్నం జరగడం గర్భితమైన కుట్ర. ఇది కేవలం వ్యక్తిగత స్థాయిలో జరిగిన దాడి కాదు.. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే స్వరాలపై చేసిన దాడి" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.