నా ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి - షర్మిల
NEWS Jun 17,2025 04:37 pm
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బాంబు పేల్చారు. తన ఫోన్లు కూడా హైదరాబాద్ లో ట్యాపింగ్ చేశారంటూ ఆరోపించారు. తను ఎవరెవరితో మాట్లాడు తున్నారన్నది ఎప్పటికప్పుడు జగన్ కు చేరవేశారని అనుమానాలు ఉన్నాయన్నారు. తనకు సంబంధించి ప్రభాకర్ రావు టీం కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడారంటూ మండిపడ్డారు. దీనిపై అనుమానం వచ్చిన తాను ఫోన్లు మార్చానంటూ తెలిపారు. తాజాగా షర్మిల చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.