మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు. తాము గనుక బీహార్ లో గెలిస్తే వంద శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. స్థానికులకే ప్రయారిటీ ఇస్తాం, అంతే కాదు వారికే జాబ్స్ దక్కేలా చట్టం కూడా తీసుకు వస్తామని చెప్పారు.