డీకే శివకుమార్ తమ్ముడికి ఈడీ షాక్
NEWS Jun 17,2025 03:47 pm
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్ కు ఈడీ ఝలక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఐశ్వర్య గౌడ్ అనే మహిళతో తనకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా గతంలో పలువురు ప్రముఖులు తనకు బంధువులు అంటూ చెప్పి డబ్బులు వసూలు చేసింది ఐశ్వర్య గౌడ్. విచారణలో భాగంగా తనకు డీకే సురేష్ కూడా టచ్ లో ఉన్నాడని చెప్పడంతో ఈడీ షాక్ ఇచ్చింది.