కుప్పంలో దారుణం సీఎం ఆగ్రహం
NEWS Jun 17,2025 11:31 am
కుప్పంలో మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు ముని కన్నప్ప, కుటుంబీకులు. ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై ఎస్పీతో మాట్లాడారు సీఎం. నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు ఎస్పీ. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలన్నారు.