వాళ్లంతా కుక్కలు పట్టించుకోను - సీఎం
NEWS Jun 17,2025 08:58 am
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి ఆయన కుక్కలతో పోల్చారు. రోడ్డు మీద అరిచే ప్రతి కుక్కని రాయితో కొట్టలేమని అన్నారు. పదేళ్లు పాలించి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి ఇంకా సిగ్గు లేకుండా రోడ్లపైకి వచ్చి నన్ను తిడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్ని తిట్టినా తాను వాళ్లను పట్టించుకోనని అన్నారు. వాళ్ల తిట్లన్నీ ఆశీర్వాదంగా భావిస్తానని చెప్పారు. తాను తన పని చేసుకుంటూ వెళతానని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెడతానని చెప్పారు.