తాను ఏ తప్పూ చేయలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఏసీబీ విచారణ ముందుకు హాజరయ్యారు. తనను 7 గంటలపాటు విచారించింది. మరోసారి విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఈ సందర్బంగా సంచలన కామెంట్స్ చేశారు. దమ్ముంటే తనపై లై డిటెక్టర్ పరీక్ష చేయాలని సవాల్ విసిరారు. పూర్తిగా నిధుల బదిలీ అనేది పారదర్శకంగా జరిగిందన్నారు. తాను ఎక్కడ అవినీతికి పాల్పడ్డానో చెప్పాలని తాను ఏసీబీ ఆఫీసర్లను అడిగానని వారు నోరు మెదప లేదన్నారు.