మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ బడుల్లో ఒక్క బాత్రూమ్ కూడా కట్టలేదన్నారు. ఏడాది కాలంలో ఒక్క పాఠశాల భవనం నిర్మించ లేదన్నారు. నాడు నేడు పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయని ఆరోపించారు. రూ.2 వేలు కట్ చేసుకొని రూ.13 వేలు మాత్రమే ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ మిగిలి పోయిన రెండు వేలను ఎవరి ఖాతాల్లో జమ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.