పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ సీరియస్
NEWS Jun 16,2025 04:18 pm
మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడాన్ని తప్పు పట్టారు. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఒకరి మంత్రిత్వ శాఖపై మరొకరు మాట్లాడటం ఏంటి అంటూ మండిపడ్డారు. కోర్టు పరిధిలోని విషయాలు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పార్టీతో చర్చించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దంటూ సూచించారు.