భీమవరం: బీజేపీ రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణను అమలాపురంకి చెందిన అంబేద్కర్ కోనసీమ జిల్లా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కొండేటి ఈశ్వర్ గౌడ్ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పాకా సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్రంలో కూడా కుటమీ ప్రభుత్వం అభివృద్ధి వైపు దిశగా పాలన సాగిస్తుందని చెప్పారు.