ఇంద్రాయణి ఘటన బాధాకరం - మోదీ
NEWS Jun 16,2025 09:52 am
మహారాష్ట్రలోని పూణే ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ఘటనలో పలువురు మృతి చెందడం, గల్లంతు కావడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర సర్కార్ సాయం చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి అమిత్ షా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సీఎం ఫడ్నవీస్ తో. సహాయక బృందాలు ఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టాయని ఈ సందర్బంగా వెల్లడించారు.