త్వరలో తెలంగాణలో మాదే అధికారం
NEWS Jun 16,2025 09:47 am
నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ , బీజేపీ బలంగా ఉన్నాయని, బీఆర్ఎస్ తన ప్రాభవాన్ని కోల్పోతోందన్నారు. దేశ వ్యాప్తంగా కాషాయ గాలి వీస్తోందని చెప్పారు. సమర్థవంతమైన మోదీ నాయకత్వానికి జనం జై కొడుతున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రపంచంలో అత్యంత బలీయమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందన్నారు.