మాజీ సీఎం జగన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి నారా లోకేష్. తల్లికి వందనంపై నిరాధార ఆరోపణలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే నిరూపించాలని అన్నారు. మరోసారి అసత్య ప్రచారానికి తన మీడియా ద్వారా చేయిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆరుగురి కంటే ఎక్కువ మంది పిల్లలకు డబ్బులు జమ చేయలేదన్నారు. ఒకవేళ అలా చేసినట్లయితే నిరూపించాలన్నారు. పూర్తిగా పరిశీలించిన తర్వాతనే జాబితా ప్రకారం నిధులు రిలీజ్ చేశామన్నారు.