విద్యా ప్రమాణాల పెంపు కోసం ఎన్జీఓల సహకారం
NEWS Jun 16,2025 03:07 am
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ బడులలో విద్యా ప్రమాణాలు పెంచేందు కోసం దేశంలో పేరు పొందిన ఆరు విద్యా పరంగా కృషి చేస్తున్న స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విద్యా శాఖతో ఎంఓయూ చేసుకున్నాయి. ఇందులో ఎక్ స్టెప్ ఫౌండేషన్, ఫిజిక్స్ వాలా, ఖానా అకాడమీ, ప్రజ్వలా ఫౌండేషన్, జై జామ్ ఫౌండేషన్ లు ఉన్నాయి. పోటీ పరీక్షలతో పాటు ఇతర ప్రధాన అంశాలపై సాంకేతిక పరిజ్ఞానం అందిస్తాయి. పోటీ పరీక్షలకు సన్నద్దం చేస్తాయి.