కూటమి ప్రభుత్వానికి అమ్మలు వందనం చేస్తున్నారు
NEWS Jun 16,2025 12:23 am
ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం పథకంతో తల్లుల ముఖల్లో ఆనందం వెల్లివిరిసి కూటమి సర్కార్ కు అమ్మలంతా వందనం చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆదివారం రామచంద్రపురం మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పాఠశాలలు పునఃప్రారంభం నుంచే తల్లికి వందనం పథకం సకాలంలో అందజేసి విద్యార్థుల చదువులకు ఉపయోగ పడిందని అన్నారు. గత వైసీపీ పాలనలో సకాలంలో ఇవ్వక విద్యార్థులు అవస్థలు పడే వారన్నారు. చదువును మించిన ఆయుధం లేదని ఆ చదువుతో ప్రపంచాన్ని మార్చొచ్చు అన్నారు. మంచి చదువుతోనే ఉన్నత భవిష్యత్తు అని అన్నారు.