పూణెలో ఘోర ప్రమాదం..కూలిన వంతెన
NEWS Jun 15,2025 05:22 pm
మహారాష్ట్ర పూణెలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న వంతెన కుప్ప కూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 25 మంది గల్లంతయ్యారు. భారీ వరద ఉధృతితో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. వీకెండ్ కావడంతో పెద్ద ఎత్తున తరలి వచ్చారు పర్యాటకులు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డెడ్ బాడీస్ ను వెతికే పనిలో పడ్డాయి.