1989-90 పూర్వ విద్యార్థినులు ఆత్మీయ సమ్మేళన
NEWS Jun 15,2025 05:34 pm
మెట్ పల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 1989-90 లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థినులు ఆత్మీయ సమ్మేళన ఘనంగా జరుపుకున్నారు. పదో తరగతిలో కలిసి చదువుకున్న విద్యార్థి నులంతా 35 సంవత్సరాల తర్వాత ఒక చోట చేరి సందడి చేశారు.వీరంతా పట్టణంలోని ఆర్.బి రెస్టారెంట్ లో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో తమకు పాటలు చెప్పిన గురువులను పిలిచి ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.