ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ
NEWS Jun 15,2025 04:13 pm
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాథమిక నివేదికకు కేంద్రం ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకించినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణకు గాని, బోర్డులకు కానీ సమాచారం అందించకుండా ఏకపక్షంగా విభజన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. త్వరలోనే ప్రాజెక్టుకు టెండర్లు కూడా పిలువనున్నట్లు తెలుస్తోందని పేర్కొ్నారు. ఈ అంశాన్ని చర్చించడానికి వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర జల్ శక్తి మంత్రిని కోరాలని సూచించారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.