గోదావరి నదిలో ఐదుగురు యువకులు మృతి
NEWS Jun 15,2025 12:53 pm
బాసర వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఐదుగురు యువకులు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. ఈత రాక పోవడం, వీళ్ళు వెళ్ళిన చోట నీళ్లు లోతుగా ఉండటం వల్లే చని పోయి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో ఆయా కుటుంబాలలో విషాదం అలుముకుంది.