అమలాపురం: వివాహిత అదృశ్యం
NEWS Jun 16,2025 08:15 pm
కోనసీమ: అమలాపురం మండలం పేరూరు కి చెందిన ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైంది. నగేష్ భార్య హారతి (24), కుమార్తె నందన (6), కుమారుడు అయాన్ భార్గవ్(4) శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మామిడికుదురులోని పుట్టినింటికి వెళ్తున్నామని చెప్పి కనిపించకుండా పోయారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో నగేష్ అమలాపురం పోలీసులను ఆశ్రయించారు.