ప్రభాకర్ రావుకు సిట్ ఆదేశం
NEWS Jun 15,2025 10:11 am
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 17న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావును సిట్ ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి మూడుసార్లు విచారించింది. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు మరికొన్ని ఆధారాలపై తనను విచారించింది. కానీ సహకరించక పోవడంతో మరోసారి రావాలని స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులైన రాజకీయ నేతలు, బిజినెస్ మెన్స్, జర్నలిస్టులను పిలిచి వారి స్టేట్మెంట్స్ కూడా తీసుకోనుంది సిట్.