సీఎంని కలిసిన T-PCC ప్రధాన కార్యదర్శి
NEWS Jun 16,2025 07:53 pm
టీపీసీసీ నూతన ప్రధాన కార్యదర్శిగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించారు. తనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సీఎం కోరినట్లు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో పార్టీ పరిస్థితిని సీఎంఅడిగి తెలుసుకున్నారని, కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరారు.