కేటీఆర్ కు నోటీస్ హరీశ్ సీరియస్
NEWS Jun 14,2025 08:54 am
మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ సర్కార్ కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కావాలని కేటీఆర్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఫార్ములా-ఈ కేసులో విచారణ కోసం మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. పాలనా పరంగా ప్రజా సమస్యలను పరిష్కరించ లేక ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం దారుణమన్నారు.