విమాన ప్రమాదంపై విచారణ చేపట్టాలి
NEWS Jun 13,2025 10:44 am
ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలి పోయిన సంఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల స్పందించారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. ఇదే సమయంలో ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల ప్రమేయం లేక పోలేదన్న అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఈ దుర్ఘటనపై విచారణకు ఆదేశించాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.