అహ్మదాబాద్ కు చేరుకున్న ప్రధాని
NEWS Jun 13,2025 10:06 am
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ కు చేరుకున్నారు. నిన్న ఎయిర్ ఇండియా విమానం మేఘా నగర్ లో కూలి పోయింది. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. విశ్వాస్ అనే ప్రయాణీకుడు బతికి బయట పడ్డాడు. మెడికల్ కాలేజీ పై పడడంతో 24 మంది మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పీఎం సందర్శించారు. పీఎం పర్యటన సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సీఎం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.