శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.11 కోట్లు
NEWS Jun 13,2025 08:33 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 69 వేల 609 మంది భక్తులు దర్శించుకున్నారు. 33 వేల 144 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.11 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం భక్తుల క్యూ లైన్ ఏటీజీహెచ్ వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 16 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.