భారత అమ్ముల పొదిలోకి త్వరలోనే రుద్రాస్త్ర అనే వినూత్న మానవ రహిత విమానం (యూఏవీ) రానుంది.సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన ఈ హైబ్రిడ్ యూఏవీని రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో విజయవంతంగా పరీక్షించారు. రుద్రాస్త్ర ఎంచుకున్న లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఆత్మ నిర్భర్ భారత్‌లో రక్షణ రంగ టెక్నాలజీ అభివృద్ధికి రుద్రాస్త్ర నిదర్శనం అని పేర్కొన్నాయి. రుద్రాస్త్ర సక్సెస్ కావడం పట్ల ప్రధాని మోదీ అభినందించారు.