పొలాలను సందర్శించిన జిల్లా వ్యవసాయధికారి
NEWS Jun 13,2025 01:00 am
మల్యాలలో పచ్చిరొట్ట విత్తనాలు జీలుగా వేసిన రైతుల పొలాలను జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ సందర్శించారు. పచ్చిరొట్ట వేసిన రైతులు డీఏపీ, అడుగు మందులు కాకుండా సింగిల్ సూపర్ పాస్పేట్ వేసుకోవాలని సూచించారు. దీనివలన జీలుగా తొందరగా మురిగి వరి మొక్కకు పోషకాలను అధికంగా అందుబాటులో ఉంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో చంద్ర దీపక్, ఏఈఓ కారుణ్య, రైతులు పాల్గొన్నారు.