గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలి పోయింది. ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. టాకేఫ్ తీసుకుంటున్న కొద్ది సేపటికే నగరంలోని మేఘా నగర్ లో ఇళ్లపై కూలి పోయింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో జర్నీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి దుర్మరణం చెందినట్లు ప్రకటించింది కేంద్రం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫ్లైట్ కూలి పోవడంతో అర్ధాంతరంగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టును మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.