గ్రూప్ -1పై విచారణ 30కి వాయిదా
NEWS Jun 12,2025 09:50 am
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ -1 వివాదానికి సంబంధించిన కేసును విచారించింది హైకోర్టు. వాదోపవాదనలు విన్న కోర్టు ఈనెల 30కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా పరీక్ష కేంద్రాల కేటాయింపు, మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా అభ్యర్థులు అపోహ పడుతున్నారని నిపుణులతో మూల్యాంకనం చేయించామని తెలిపారు TGPSC లాయర్.