ముగిసిన ప్రభాకర్ రావు విచారణ
NEWS Jun 12,2025 08:25 am
తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. 9 గంటలకు పైగా సిట్ విచారించింది. ఎన్ని ప్రశ్నలు వేసినా తనకు తెలియదంటూ సమాధానం చెప్పినట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించడం, ప్రతిపక్ష నాయకులు, వ్యాపారులు, సినీ రంగానికి చెందిన వారు, జర్నలిస్ట్ లకు సంబంధించిన ఫోన్లను దొంగచాటుగా రికార్డ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనపై సిట్ ఏర్పాటు చేసింది సర్కార్.