జాతీయ మానవ హక్కుల కమిషన్ మాజీ సీఎం జగన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాకు ఝలక్ ఇచ్చింది. అమరావతి మహిళా రైతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. సుమోటోగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది ఎన్ హెచ్ ఆర్ సీ. ఇప్పటికే సీనియర్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస రావుతో పాటు కృష్ణంరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా సాక్షి మీడియాపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.