క్రీడలకూ ప్రాధాన్యత: మంత్రి సుభాష్
NEWS Jun 12,2025 02:55 pm
విద్యార్థులుకు చదువుతోపాటు క్రీడలకు కూడా సమ ప్రాధాన్యతనిచ్చి, జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని మంత్రి సుభాష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానంలో జరిగిన బాస్కెట్ బాల్ సమ్మర్ కోచింగ్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్ననాటి నుండే ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో జీవితానికి బాటలు వేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.