తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల ధర్నా
NEWS Jun 11,2025 01:29 pm
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,నూతన అక్రిడేషన్ కార్డ్స్ వెంటనే మంజూరు చేయాలనీ కోరుతూ ఏపిడబ్లూజెఎఫ్ మైలవరం నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అక్రిడేషన్ కార్డ్స్ మంజూరు చేయాలనీ జర్నలిస్టులు నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాహసిల్దార్ సాయి మహేష్ కు అందజేశారు. కార్యక్రమంలో ఆవుటి బాబు, రాఘవులు,శివ, గోపి తదితరులు పాల్గొన్నారు.