విద్యార్థులు విద్యపై ఫోకస్ పెట్టాలి
NEWS Jun 10,2025 08:14 am
విద్యార్థులు మారుతున్న టెక్నాలజీని అంది పుచ్చుకోవాలని, విద్యపై మరింత పట్టు పెంచుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి సత్య కుమార్ యాదవ్. విజయవాడలో జరిగిన ఏపీ షైనింగ్ అవార్డుల కార్యక్రమంలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన స్టూడెంట్స్ కు ఆయన అవార్డులను బహూకరించారు. ఏపీ సర్కార్ విద్యా రంగంపై ఎక్కువగా దృష్టి సారించిందన్నారు. ఏపీని ఏఐ , ఎంఐ, సైబర్ సెక్యూరిటీ హబ్ లుగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తోందని చెప్పారు. చెడు అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.