కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్యే నాగరాజు సెటైర్లు
NEWS Jun 09,2025 04:52 pm
ఎమ్మెల్సీ కవితపై సెటైర్లు వేశారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. ఇన్ని రోజులు సీసా బుడ్డి ఎత్తుకొని తిరిగి, ఇప్పుడు మళ్లీ తెలంగాణ జాగృతి అంటే ఎలా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణ బాపుకే నోటీసులు ఇస్తారా అనడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ బాపు కాదని అసలైన సిసలైన బాపు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ప్రజలను కలవకుండా 24 గంటలు ఫామ్ హౌస్ లో తాగి పండేవాడు బాపు ఎలా అవుతాడని నిలదీశారు.