గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్నారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే మనోడు ముందస్తు సమాచారం లేకుండానే అనారోగ్యం ఉందనే సాకుతో అమెరికాకు చెక్కేశాడు. ఇక్కడి సర్కార్ తనపై విచారణకు ఆదేశించింది. ఏర్పాటు చేసిన సిట్ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేయడంతో మనోడు హైదరాబాద్ కు చేరుకున్నారు. చుట్టూ అనుచురుల ఓవర్ యాక్షన్ చేశారు.